అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం..

భువనగిరి జిల్లా: అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖలో వృత్తి రీత్యా ప్రాణాలు పోగొట్టుకున్న వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ.. నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక జిల్లా అధికారి పి. జయప్రకాశ్ రావు, అధికారులు యాదగిరి, వి. అశోక్, డాక్టర్ బాబు, రమేష్ పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments